Breaking News

రాజకీయ నేతలకు వలపు వల.. రొమాన్స్ చేస్తూ వీడియోలు తీసి


రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు అమ్మాయిలతో వలపు వల వేసి వారిని బెదిరిస్తున్న ముఠాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తనను ఓ ముఠా వేధిస్తోందని ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలకు వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ముఠా స్థావరాన్ని పోలీసులు గుర్తించగలిగి 8 మందిని అరెస్ట్ చేశారు. Also Read: ఈ ముఠా ఇద్దరు అందమైన మహిళల ద్వారా రాజకీయ నాయకులను ముగ్గులోకి దించి వారు ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియో తీసి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కోవలోనే నార్త్ కర్ణాట ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వద్దకు ఓ మోడల్‌ను పంపించారు. ఆమె అతడిని ముగ్గులోకి దించి సెక్స్‌ చేసేలా ప్రేరేపించింది. ఆ నేత ఆమెతో రాసలీలలు కొనసాగిస్తుండగా ముఠా సభ్యులు రహస్యంగా వీడియో రికార్డ్ చేశారు. Also Read: ఆ తర్వాత అతడికి ఫోన్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. వేధింపులతో విసిగిపోయిన ఎమ్మెల్యే క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టయింది. అయితే ముఠా కీలక సూత్రధారి తప్పించుకున్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి హోటళ్లలో బస చేసినప్పుడు ఈ ముఠా అమ్మాయిలను ఎరగా వేసి వారి రాసలీలలను రికార్డ్ చేస్తోందని పోలీసులు తెలిపారు. వీరి చేతిలో ఎంతమంది మోసపోయారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 29, 2019 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/honeytrap-bengaluru-police-bust-massive-sex-racket-targeting-politicians-and-business-men/articleshow/72282011.cms

No comments