అత్తింట్లో అడుగుపెట్టిన కొత్తకోడలికి 4నెలల గర్భం... షాకైన బంధువులు
జిల్లా గొల్లప్రోలు మండలానికి చెందిన ఓ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ బాలిక(17)పై కన్నేసిన మోరకుర్తి అప్పలరాజు అనే వ్యక్తి ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించి లోబరుచుకున్నాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే బాలిక ఇటీవల గర్భం దాల్చింది. Also Read: ఈ విషయం తెలియని బాలిక తల్లిదండ్రులు ఆమెకు ఈ నెల 14న మరో వ్యక్తితో వివాహం జరిపించారు. బాలిక అత్తింట్లోకి అడుగుపెట్టగానే ఆమె గురించి ఎవరో అత్తమామలకు చెప్పారు. దీంతో వారు వైద్య పరీక్షలు చేయించగా ఆమె 4నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. దీంతో అత్తమామలు బాలికను పుట్టింటికి పంపేశారు. అసలేం జరిగిందని తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో బాలిక పురుగుల మందు తాగేసింది. దీంతో ఆమె ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను విచారించగా అప్పలరాజు తనను బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. Also Read: కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ బుధవారం బాలిక గ్రామంలో పర్యటించి పలువురిని విచారించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అప్పలరాజు గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా హైవే జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. Also Read:
By November 21, 2019 at 09:49AM
No comments