Breaking News

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను 15సార్లు పొడిచి చంపిన భర్త


భార్య వేరే వ్యక్తి పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి రాక్షుడిగా మారాడు. కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా కత్తితో అమెను ఏకంగా 15సార్లు పొడిచి దారుణంగా చంపేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ పట్టణంలో సంజయ్ అనే వ్యక్తి భార్య ఫూల్‌మాలా, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. సంజయ్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Also Read: గురువారం ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుండగా భార్యను మరో వ్యక్తితో చూశాడు. భార్య ఆ వ్యక్తితో చాలా సన్నిహితంగా మాట్లాడటాన్ని సహించలేకపోయిన సంజయ్ శుక్రవారం మధ్యాహ్నం భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కోపంతో ఊగిపోయిన అతడు కిచెన్‌లోని కత్తి తీసుకుని భార్య కడుపులో ఏకంగా 15సార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పూల్‌మాలా అపస్మారక స్థితికి చేరుకోవడంతో సంజయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పూల్‌మాలాను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూల్‌మాలా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న సంజయ్ కోసం గాలిస్తున్నారు. Also Read:


By November 03, 2019 at 12:31PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-woman-illegal-affair-with-other-man-angry-husband-killed-her/articleshow/71875169.cms

No comments