11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడికి చచ్చేవరకు జైలుశిక్ష

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం చనిపోయేవరకు ఖైదు విధించిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన బాలిక(11) ముత్తుకూరులోని తన అమ్మమ్మ దగ్గర కొంతకాలం ఉండేందుకు వచ్చింది. ఈ బాలిక తరచూ దగ్గరలోని కిరాణాషాపునకు వెళ్లి వస్తుండేది. దీన్ని గమనించిన ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీ మల్లిపాటి సాయికృష్ణ బాలికపై కన్నేశాడు. Also Read: ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలు పర్యాయాలు ఆమెపై లైంగిక దాడి జరిపాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి చాక్లెట్లు కొనిచ్చేవాడు. 2015, మే 21వ తేదీన కిరాణా షాపుకి వెళ్లి బాలికను సాయికృష్ణ మరోసారి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక మరుసటి రోజు తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: సాయికృష్ణ తనపై గతంలోనూ అనేకసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుడిపై కేసు నమోదుచేశారు. సాయికృష్ణపై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో జడ్జి జీఎస్. రమేశ్‌కుమార్ సాయికృష్ణను చనిపోయేంతవరకు జైలులోనే ఉంచాలని తీర్చు చెప్పడంతో పాటు అతడికి రూ.2లక్షల జరిమానా విధించారు. Also Read:
By November 30, 2019 at 11:56AM
No comments