YSRCP: నమ్మకానికి పెద్దపీట.. ఆ కాపు నేతకు జగన్ మరో కీలక పదవి

తూర్పుగోదావరి: రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు జగన్ మరో కీలక పదవిని కట్టబెట్టారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఇప్పటికే కట్టబెట్టిన జగన్.. ఆయన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా తూర్పు గోదావరి జిల్లా నుంచి జక్కంపూడికి మాత్రమే అవకాశం లభించింది. రాజా గతంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2011లో అనారోగ్యం కారణంగా కన్నమూశారు. 2014 ఎన్నికల్లో రామ్మోహన్ సతీమణి విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో రాజా ఘన విజయం సాధించారు. రాజాకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు జగన్.. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు.
By October 22, 2019 at 10:07AM
No comments