Breaking News

ఒకే ఫ్రేంలో Mahesh, Nayan.. ఫొటో అదుర్స్


స్టార్ సెలబ్రిటీలను ఒకే ఫ్రేంలో చూడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏదన్నా అవార్డ్స్ సమయంలో కానీ, పార్టీలలో కానీ వారందరినీ ఒకే దగ్గర చూస్తుంటాం. అయితే కొందరు సెలబ్రిటీలు అసలు ఏ ఈవెంట్స్‌కూ హాజరవరు. వారిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఒకరు. ఆమె తాను నటించే సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్‌కి కూడా రారు. ఎవ్వరికీ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వరు. తనపై ఏవన్నా అసత్యాలు ప్రచారం అయినా, లేదన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్ వైరల్ అయితే తప్ప నయన్ మీడియా ముందుకు రారు. అలాంటిది ఆమె ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ నిర్వహించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో నయన్‌తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ముగ్గురినీ ఒకే ఫ్రేంలో చూపిస్తూ తీసిన ఫొటోని మహేశ్ సతీమణి నమత్ర శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటో చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. మహేశ్ స్టైల్‌గా స్టూల్‌పై కూర్చుని ఉండగా ఆయనకు ఎడమ పక్క నయన్, కుడివైపు దుల్కర్ నిలబడి ఉన్నారు. నయన్ ఇలాంటి మ్యాగజైన్‌లకు ఫొటోషూట్లు ఇవ్వడం కూడా చాలా అరుదు. ఆమె నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఫొటోషూట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాకుండా సైరా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో నయన్ పాల్గొనలేదు. కనీసం ఈ రకంగానైనా ఓసారి ఫ్యాన్స్‌ని పలకరించాలని అనుకున్నారేమో. మరోపక్క మహేశ్ ఈ ఏడాది ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. తన రీసెంట్ హిట్స్, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ మ్యాగజైన్‌తో పంచుకున్నట్లున్నారు. అదే విధంగా దుల్కర్ సల్మాన్ ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమాతో బాలీవుడ్‌లో సుపరిచితులయ్యారు. అంతకుముందు నటించిన ‘కర్వా’ సినిమా విజయం సాధించలేకపోయింది. ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళంలో ఆయన సొంత నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమాను నిర్మించనున్నారు. ఇలా అన్ని భాషలను టచ్ చేస్తూ తన కంటూ గుర్తింపు తెచ్చుకోవాలని దుల్కర్ ప్రయత్నిస్తున్నారు.


By October 05, 2019 at 11:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/south-indian-superstars-mahesh-babu-nayanthara-dulquer-salmaan-feature-on-vogue-fashion-magazine/articleshow/71451838.cms

No comments