Breaking News

Kurnool: రూ.10వేల అప్పు తిరిగివ్వలేదని మహిళ దారుణహత్య


అప్పు విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. తన వద్ద తీసుకున్న రూ.10వేల అప్పును తిరిగివ్వలేదని ఓ ఆటోడ్రైవర్ మహిళను దారుణంగా చంపేశాడు. కర్నూలుకు చెందిన మంగలి విజయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి(30) మొదటిభర్తతో తెగదెంపులు చేసుకోవటంతో ఆరేళ్ల క్రితం పాణ్యం మండలం తమ్మరాజుపల్లెకు చెందిన సందేలు అంజిని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె సంతానం. Also Read: కొంతకాలం క్రితం లక్ష్మి కుందేలు బాలు అలియాస్ కంసలిబాబు అనే ఆటోడ్రైవర్ వద్ద రూ.10వేల అప్పు తీసుకుంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆమె సకాలంలో అప్పు తీర్చలేకపోయింది. దీంతో కుందేలు బాబు ఆమెపై కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బుధవారపేట కల్లు దుకాణంలో లక్ష్మి, ఆమె భర్త, కుందేలుబాబు కలిసి కల్లు తాగారు. ఈ సందర్భంలో తీసుకున్న రూ.10 వేలు ఇవ్వాలని అతడు గట్టిగా అడగటంతో ఇప్పుడు ఇవ్వలేనని లక్ష్మి తెగేసి చెప్పింది. Also Read: ఆ తర్వాత దంపతులిద్దరూ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బాబు వారికి ఫోన్ చేసి కల్లు దుకాణం దగ్గరికి రావాలని చెప్పాడు. ఆటో దిగుతున్న లక్ష్మిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన లక్ష్మి భర్త అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తప్పించుకునే క్రమంలో ఓ ఆస్పత్రి వద్దకు వెళ్లి కుప్పకూలిపోయింది. అక్కడి డాక్టర్లు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: తీవ్ర రక్తస్రావంతో లక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదు మేరకు కంసలిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కంసలి బాబు గతంలో అనేక చోరీలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read:


By October 08, 2019 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-brutally-murdered-by-auto-driver-in-kurnool/articleshow/71486648.cms

No comments