Breaking News

Hyderabad: డైట్ ప్లాన్ వివరించేందుకు వచ్చి యువతిపై అత్యాచారం


హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. డైటింగ్ ప్లాన్ వివరించేందుకు ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ ట్రూవెయిట్‌ న్యూట్రీషియన్‌ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌ద్వారా ఆ సంస్థను సంప్రదించింది. తనకు డైటింగ్ ప్లాన్ కావాలని ఆమె కోరడంతో ఈ నెల 9వ తేదీన తమ ఏజెంట్ ఇంటికి వచ్చిన వివరిస్తారని మెసేజ్ వచ్చింది. 10వ తేదీన షాజిద్ ఆ యువతి ఇంటికి వెళ్లి కలిశాడు. డైట్ ప్లాన్ వివరిస్తుండగా యువతి ఇంట్లో ఒంటరిగానే ఉన్న విషయం తెలుసుకున్నాడు. Also Read: దీంతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చంపేస్తానని బెదిరించి యువతిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మొహంపై యాసిడ్ పోసేస్తానని బెదిరించాడు. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పిన యువతి 16వ తేదీన మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు షాజిద్‌పై కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేశారు. Also Read:


By October 23, 2019 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-raped-by-diet-nutritionist-in-hyderabad/articleshow/71714912.cms

No comments