Hyderabad: ప్రియురాలు మాట్లాడటం లేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి యువతి తనను దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఎంఆర్‌సీ కాలనీలో నివసించే అభిషేక్(20) యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. తనకు బంధువైన ఓ యువతి(19)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అభిషేక్‌తో చనువుగా ఉండేది. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు తిరిగారు. చరవాణుల్లో మాటలు, సందేశాలు, ఫొటోలు పంపించుకున్నారు. Also Read: రెండు నెలల క్రితం ప్రేమికుల మధ్య చిన్న తగాదా రావడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఆ యువతి అభిషేక్‌ను పూర్తిగా దూరం పెట్టింది. ప్రియురాలు తనను పట్టించుకోకపోవడంతో అభిషేక్ డిప్రెషన్‌లోని వెళ్లిపోయాడు. ఆమెతో మాట్లాడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తనకు చావే శరణ్యమనుకున్నాడు. ప్రియురాలితో చివరిసారిగా మాట్లాడాలని శుక్రవారం మెసేజ్ పెట్టాడు. తాను చనిపోతున్నానని, చివరిసారిగా నీతో మాట్లాడాలని మెసేజ్ చేసినా ఆమె పట్టించుకోలేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. Also Read: దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అభిషేక్ శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించి అతడి అన్న, వదిన కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అభిషేక్ తండ్రి శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By October 13, 2019 at 10:28AM
No comments