Breaking News

Chhattisgarh: జైలుకు పంపిందన్న కక్షతో యువతిపై గ్యాంగ్ రేప్


కోరిక తీర్చాలంటూ 19ఏళ్ల యువతిని వేధిస్తున్న ఇద్దరు కామాంధులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. కొరియా జిల్లాలోని హరాగ్రాఖండ్ గ్రామానికి చెందిన ఓ యువతిని ఇద్దరు యువకులు శనివారం ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: వారి పైశాచికత్వానికి బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె బతికుంటే తాము జైలుకెళ్లడం ఖాయమనుకున్న ఆ కామాంధులు చెట్టుకు ఉరేసి వెళ్లిపోయారు. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి బాధితురాలిని రక్షించారు. వారి సాయంతో యువతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. Also Read: బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి నిందితుల్లో ఒకరు గతంలో ఇదే యువతిని వేధించినందుకు మూడు నెలల జైలుశిక్ష అనుభవించాడని, ఆ కక్షతోనే స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. Also Read:


By October 17, 2019 at 11:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chhattisgarh-man-rapes-19-yr-old-woman-with-his-friend/articleshow/71626592.cms

No comments