Breaking News

ఆ బాధతో రెండు రోజులు నిద్రపట్టలేదు : ఐశ్వర్య


తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న భామ ఐశ్వర్య రాజేష్‌. కోలీవుడ్ మూవీ కాక్కముట్టైతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలోనూ అడుగు పెట్టి బహు భాషానటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ భామ ఓ సినిమా అవకాశం కోల్పోవడంపై స్పందించారు. కోలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న ఐశ్వర్యను లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమా కోసం సంప్రదించారు. కమల్‌, శంకర్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఐశ్వర్య కూడా వెంటనే ఓకే చెప్పేసింది. గత ఏడాది డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించాలనే ఆలోచనతో ఐశ్వర్య డేట్స్‌ కూడా తీసుకున్నారు. Also Read: కానీ ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇండియన్‌ 2 షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా ఐశ్వర్య ఇతర చిత్రాలతో బిజీ అయ్యింది. ఆగస్టులో ఇండియన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి ఐశ్వర్య డేట్స్‌ ఖాళీ లేకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని మీడియాతో షేర్‌ చేసుకున్న ఐశ్వర్య, అంత భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి రావటం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపింది. కమల్‌ హాసన్‌ లాంటి నటుడితో కలిసి నటించే అవకాశం వదులుకోవాల్సి రావటంతో రెండు రోజులు అసలు నిద్రకూడా పట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగులో రెండు, తమిళ్‌లో నాలుుగు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. మరో మూడు తమిళ చిత్రాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


By October 02, 2019 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aishwarya-rajesh-says-i-couldnt-sleep-for-days-after-getting-out-of-indian-2/articleshow/71404767.cms

No comments