Breaking News

`అమ్మ` కథలో రామ్ చరణ్ విలన్‌


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించిన దగ్గర నుంచి ఆమె మరణం విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఒంటరి మహిళగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన జయలలిత జీవితంలో ఓ కమర్షియల్ సినిమా కావాల్సిన అన్ని రకాల మసాలాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆమె జీవిత కథను వెండితెర మీదకు ఎక్కించేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల నిర్మాత విష్ణు ఇందూరి భారీ బడ్జెట్‌తో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించిన కంగనా విదేశాల్లో మేకప్‌ టెస్ట్‌లు కూడా చేశారు. అంతేకాదు తెర మీద జయలా కనిపించేందుకు బరువు కూడా పెరుగుతున్నారు. Also Read: తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన మరో పాత్రలో బహుభాషా నటుడు అరవింద్‌ స్వామి నటించనున్నారు. జయలలిత సినీ, రాజకీయ జీవితాల్లో కీలక పాత్ర పోషించిన మరుతూర్‌ గోపాల రామచంద్రన్‌ (ఎమ్జీఆర్‌) పాత్రలో అరవింద్ స్వామి నటించనున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్రప్రసాధ్‌ కథ అందింస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాకు శైలేష్‌ సింగ్‌ మరో నిర్మాత. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో తమిళ్‌, తెలుగు, హిందీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. Also Read: అయితే ఇప్పటికే జయలలిత జీవిత కథతో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ `క్వీన్` పేరుతో జయలలిత బయోపిక్‌ను వెబ్‌ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. అయితే జయలలిత రాజకీయ జీవితం, మరణం విషయంలో ఎన్న వివాదాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌లకు అడ్డంకులు తప్పవన్న అనుమానాలు కలుగుతున్నాయి.


By October 04, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/arvind-swamy-to-play-mgr-in-kangana-ranauts-jayalalitha-biopic/articleshow/71434536.cms

No comments