Breaking News

‘సైరా’ శాటిలైట్ రైట్స్ విషయంలో ఇదే నిజం!


మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ఈరోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్‌తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల మేర సాగిందని ఒరిజినల్ లెక్కలు బయటికి వచ్చాయి. తాజాగా ఈసినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని కొనడానికి చాలా ఛానల్స్ వచ్చాయి కానీ రామ్ చరణ్ చెప్పిన రేట్ కి ఎవరూ డేర్ చేయలేదు ఒక్క జెమినీ ఛానల్ తప్ప.

జెమినీ చానెల్ వాళ్లు సైరా శాటిలైట్ ని చేజిక్కించుకున్నారు. జెమినీ వాళ్ళు కాస్త డేర్ చేసి ఈసినిమాను కొన్నారు. కేవలం శాటిలైట్ కోసం 25కోట్లు జెమిని చెల్లిస్తోందట. తెలుగు-తమిళం-మలయాళం వరకూ హక్కుల్ని ఈ చానెల్ చేజిక్కించుకుంది. డిజిటల్ జెమినీ కాదట. డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్లకు 50కోట్లకు అమ్మేశారు. మొదటి షో నుండే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి పైగా యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి కాబట్టి జెమినీ వాళ్ళు ఇంత పెట్టి కొన్నట్టు తెలుస్తుంది.



By October 03, 2019 at 02:29AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47702/sye-raa.html

No comments