Breaking News

దొంగతనం నెపంతో చిత్రహింసలు... యువతిపై మహిళ అత్యాచారం


తన ఇంట్లో దొంగతనానికి పాల్పడిందన్న నెపంతో ఓ మహిళ యువతిపై దారుణానికి పాల్పడింది. ఆమెను ఫ్రెండ్స్‌తో కలిసి చిత్రహింసలు పెట్టడమే కాకుండా అత్యాచారం చేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఓక్లాహోమాలో నివసించే లారా పల్మార్(35) అనే మహిళ కొద్దిరోజుల క్రితం 180 యూఎస్ డాలర్ల( సుమారు రూ.12వేలు) నగదును ఇంట్లో దాచింది. ఇటీవల ఆ డబ్బులు కనిపించకపోవడంతో స్థానికంగా ఉండే యువతిపై అనుమానపడింది. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఎందుకు తీశావని నిలదీసింది. Also Read: తాను తీయలేదని ఆ యువతి చెప్పినా వినిపించుకోకుండా తన ఫ్రెండ్స్‌ అయిన ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టింది. ఒంటిపై దుస్తులు విప్పించి ఆ ఇద్దరితో రేప్ చేయించింది. అయినా ఆమె కసి తీరక బాధితురాలిని బాత్‌రూమ్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టింది. గాయాలపై యాసిడ్ పోసి రాక్షసానందం పొందింది. అనంతరం తుపాకీతో బెదిరించి తాను కూడా అత్యాచారం చేసింది. నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు పల్మార్ ఇంటికి వచ్చేసరికే ముగ్గురు నిందితులు పరారయ్యారు. Also Read: ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పల్మార్‌పై ఫస్ట్ డిగ్రీ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి ఇంటి నుంచి తుపాకీ, డ్రిల్ బిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. Also Read:


By October 04, 2019 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/oklahoma-woman-raped-other-woman-with-gun-then-tortured-her-with-drill-and-acid-over-180-debt/articleshow/71433804.cms

No comments