పెళ్లింట్లో విషాదం.. వారం రోజులకే నవవరుడి దుర్మరణం

వారికి పెళ్లయి వారం రోజులే అయింది. కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. పెళ్లి కళతో వెలిగిన గురువారం ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వరుడి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. Also Read: ముండ్లమూడి గ్రామానికి చెందిన అనిల్‌కుమార్(33)కు ఈనెల 3న మద్దిపాడు మండలం దొడ్డవరానికి చెందిన సుస్మిత అనే యువతితో వివాహం జరిగింది. బీటెక్ చదివిన అనిల్ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ సర్జికల్ సామగ్రిని వైద్యశాలలకు విక్రయిస్తుంటాడు. గురువారం ఉదయం తన గ్రామం నుంచి బైక్‌పై విజయవాడలోని తన ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సర్జికల్ సామాగ్రిని విక్రయించేందుకు బయలుదేరాడు. మధ్యలో రెండుసార్లు భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. Also Read: మధ్యాహ్నం నుంచి అనిల్‌కు ఫోన్ చేయకపోవడంతో సుస్మితకు ఆందోళన మొదలైంది. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఎత్తకపోవడంతో ఎక్కడో కీడు శంకించింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొత్తూరు వద్ద రోడ్డు పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు నల్లపాడు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు చనిపోయినట్లు గుర్తించారు. హెల్మెట్ ఊడిపోవడంతో తలకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతడిని అనిల్‌కుమార్‌గా నిర్ధారించి కుటుంసభ్యులకు సమాచారమిచ్చారు. అనిల్ మరణవార్త తెలియగానే నవ వధువు సుస్మిత, అనిల్ తల్లిదండ్రులు, బంధువులు షాకయ్యారు. పెళ్లయి వారం తిరగకముందే భర్త చనిపోవడంతో సుస్మితను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అనిల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:
By October 11, 2019 at 09:32AM
No comments