తరుచూ గొడవ పడుతోందని.. భార్యనే కాల్‌గర్ల్‌గా మార్చేశాడు

భార్య తనతో తరుచూ గొడవపడి చికాకు పెడుతోందన్న కోపంతో ఓ వ్యక్తి నీచపు పనికి పాల్పడ్డాడు. భార్యను కాల్‌గర్ల్‌గా పేర్కొంటూ సోషల్‌మీడియాలో ఆమె ఫోటోతో పాటు ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. దీంతో అపరిచితుల నుంచి ఆమెకు అనేక ఫోన్లు రావడం మొదలైంది. చాలామంది అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో భాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. Also Read: హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో కుటుంబంతో కలిసి నివసించే జాన్ జార్జ్ అనే వ్యక్తి ఈసీఐఎల్‌లోని రాధికా థియేర్‌లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య తనతో అకారణంగా గొడవలు పెట్టుకుని వేధిస్తుందని భావించి జార్జ్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. Also Read: భార్య స్నేహితురాళ్లతో తీసుకున్న ఫోటోలను సేకరించి వాటిని షేర్‌చాట్‌లో పోస్ట్ చేశాడు. వీళ్లంగా కాల్‌గర్ల్ అని.. వీళ్లతో సుఖం పొందాలంటే కాల్ చేయండి అంటూ భార్య ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి జార్జ్ భార్యకు అనేక మంది ఫోన్ చేస్తూ వేధించసాగారు. దీంతో బాధితురాలు శనివారం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో కేవలం 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. కట్టుకున్న భర్తే ఈ నీచానికి పాల్పడినట్లు తెలుసుకుని బాధితురాలు షాకైంది. Also Read:
By October 06, 2019 at 08:13AM
No comments