Breaking News

80ఏళ్ల అమ్మమ్మపైనే అత్యాచారయత్నం.. కీచక మనవడి అరెస్ట్


మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి ఈ ఘటన పరాకాష్ఠగా చెప్పొచ్చు. వావి వరుసలు మరిచిన ఓ యువకుడు ఏకంగా అమ్మమ్మపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: సికింద్రాబాద్ తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎంకమ్మ(80) అనే వృద్ధురాలికి భర్త చాలాకాలం క్రితం మరణించాడు. ప్రస్తుతం ఆమె కుమార్తె కౌసల్యతో కలిసి బీ సెక్షన్‌లో నివాసముంటోంది. కౌసల్యకు గణేశ్, రఘు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు రఘు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రఘు.. ఎంకమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించి అత్యాచారానికి యత్నించాడు. Also Read: వృద్ధురాలి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రఘును చితకబాదారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి ఫిర్యాదు తీసుకున్నారు. దీంతో నిందితుడు రఘును శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎంకమ్మను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సొంత అమ్మమ్మపైనే అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:


By October 06, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-arrested-for-rape-attempt-on-grand-mother-in-hyderabad/articleshow/71461777.cms

No comments