Breaking News

అర్జున్‌ రెడ్డి మళ్లీ వస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌


టాలీవుడ్‌లో సెన్సెషన్‌ సృష్టించిన సూపర్‌ హిట్ సినిమా . ఈ ఒక్క సినిమా యంగ్ హీరో విజయ్‌ దేవరకొండను టాలీవుడ్ సెన్సేషనల్‌ హీరోగా మార్చేసింది. అంతేకాదు ఈ సినిమాతో విజయ్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు కెరీర్‌ను తార స్థాయికి చేర్చిన సినిమా అర్జున్‌ రెడ్డి. అందుకే ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. తెలుగులో సూపర్‌ హిట్ అయిన అర్జున్‌ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్‌ దర్శకత్వంలోనే తెరకెక్కించారు. బాలీవుడ్ నెగెటివ్‌ టాక్‌తోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడు అర్జున్‌ రెడ్డి. కోలీవుడ్‌ లోనూ అర్జున్‌ రెడ్డి కథ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. Also Read: విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ఆదిత్య వర్మ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సందీప్‌ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వం వహించాడు. ఇంతటి సెన్సేషన్‌ సృష్టించిన కథ, కాంబినేషన్‌ కావటంతో ఒరిజినల్ అర్జున్‌ రెడ్డి కాంబినేషన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుందని తెలుస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా, కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సందీప్‌ అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ఓ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన సందీప్‌ త్వరలోనే విజయ్‌తో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి కథతో ఉంటుంది అన్న విషయంపై మాత్రం సందీప్‌ క్లారిటీ ఇవ్వలేదు. Also Read: కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్‌ కూడా రణబీర్‌ కపూర్‌ హీరోగా ఓ డార్క్‌ క్రైమ థ్రిల్లర్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితేగాని ఈ కాంబినేషన్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం లేదు. విజయ్‌ కమిట్ అయిన ప్రాజెక్ట్‌ లు అన్ని పూర్తవ్వడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. సందీప్ చేస్తున్న బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ అవ్వాలన్నా దాదాపు అంతే సమయం పడుతుంది అంటే అర్జున్‌ రెడ్డి కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌ మీదకు రావాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది.


By October 15, 2019 at 10:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-devevarakondam-sandeep-combo-to-repeat-again-in-very-soon/articleshow/71591864.cms

No comments