గుంటూరులో జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం పెదనాన్ననే చంపేశాడు

ఆస్తి కోసం సొంత పెదనాన్ననే హత్య చేసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం కనగాలకు చెందిన మునురుల్లా ఖాన్(45)కు గ్రామంలో ఇల్లు, కాస్త పొలం ఉంది. ఆయనకు పిల్లలు లేకపోవడంతో ఆస్తిని తనకు రాసివ్వాలంటూ అతడి తమ్ముడి కొడుకు ఖాదిరుల్లా ఖాన్ ఎప్పటి నుంచో కోరుతున్నాడు. Also Read: ఈ నెల 15వ తేదీన పెదనాన్న ఇంటికి వచ్చిన ఖాదిరుల్లా ఖాన్ ఆస్తిని తన పేరిటి రాస్తావా? లేదా? అంటూ గొడవ పెట్టుకున్నాడు. రాయనని మునురుల్లా ఖాన్ తెగేసి చెప్పడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు తెనాలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆస్తి కోసం తన తమ్ముడి కుమారుడు ఖాదిరుల్లా తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: అయితే మునురుల్లా ఖాన్ పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు చనిపోయాడు. దీంతో పోలీసులు ఖాదిరుల్లాపై హత్య కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు. ఆస్తి కోసం పెదనాన్ననే చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:
By October 21, 2019 at 09:32AM
No comments