Breaking News

పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఘనంగా నిశ్చితార్థం


అలియాస్ వేద..తెలుగమ్మాయి అయిన ఈమె తపన సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె నటించిన రెండో సినిమా నేను ఆమెకి బాగా పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాతోనే ఆమెకి ఇండీస్ట్రీలో గుర్తింపు ఏర్పడింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బాగా లైమ్ లైట్ లోకి వచ్చిన అర్చన ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ చేసింది. ఆమెకి హీరోయిన్‌గా పెద్దగా పేరు రాకపోయినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం చాలా గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించింది. హిందీలో కూడా ఒక సినిమా చేసింది అర్చన. Also Read: ఆమెని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది గ్రాండ్ లెవెల్‌లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో. ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలయిన ఈ షో ఫస్ట్ సీజన్‌లో అర్చన కూడా టైటిల్ ఫేవరేట్. ఆమె టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే ఆ తరువాత కూడా ఆమె చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా రావట్లేదు. లయన్ సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది. కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తున్నా కూడా అవి ఆమె కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడేవి కాదు. దాంతో పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఎప్పటినుండో ఆమె జగదీష్ అనే వ్యక్తితో లవ్‌లో ఉంది అని టాక్ ఉంది. ఇప్పుడు అతనితోనే ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఒక ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీకి అతను వైస్ ప్రెసిడెంట్. Also Read: అక్టోబర్ 3న జగదీష్‌తో ఆమె ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్‌లో ఈ నిశ్చతార్ధ వేడుక నిర్వహించారు. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ కావడంతో ఆ షో లో ఆమెతో కలిసి పాల్గొన్న చాలా మంది ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. అలాగే హీరో నవదీప్, సుమంత్‌‌తో సహా మరికొంతమంది సినిమా ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆమె పెళ్ళి డేట్ మాత్రం బయటికి రాలేదు. మొత్తానికి ఆమె కోరుకున్న వ్యక్తితో పెళ్ళి అవుతున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఉంది. Also Read:


By October 04, 2019 at 11:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigboss-contestent-archana-aka-veda-got-engaged-to-her-long-time-boy-friend-jagadeesh/articleshow/71435633.cms

No comments