రాత్రయితే రక్తపిశాచిలా మారతాడు.. వనపర్తి జిల్లాలో వింత మనిషి

తెలంగాణలోని జిల్లాలోని ఓ వ్యక్తి తన వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్నాడు. పగటిపూట గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రాత్రయితే రక్తపిశాచిలా మారిపోతున్నాడు. గ్రామంలోని మూగజీవాలను ఎత్తుకెళ్లి బతికుండగానే కొరికి రక్తం తాగేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అతడి ప్రవర్తన జిల్లాలో హాట్‌టాపిక్ మారింది. Also Read: వనపర్తి జిల్లా సింగంపేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్యక్తి పగలంతా గ్రామంలో మామూలుగా తిరుగుతుంటాడు. రాత్రయితే రక్తపిశాచిలా మారి గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగేస్తుంటాడు. ఉదయాన్నే వాటిని యజమాని ఇంటి దగ్గర పడేస్తాడు. ఈ విధంగా రాజు ఇప్పటివరకు 60 మేకలు, గొర్రెలను చంపి రక్తం తాగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రాజు పదో తరగతి వరకు చదివి కూలి పనులు చేసుకుంటున్నాడని, అందరితో కలివిడిగా ఉండే అతడికి రక్తం తాగే అలవాటు ఎలా వచ్చిందో తెలీదని కుటుంబసభ్యులు, గ్రామస్థులు చెబుతున్నారు. Also Read: రాజు వ్యవహారంపై బాధితులు ఇప్పటికే ఎన్నో పంచాయతీలు పెట్టి జరిమానాలు వసూలు చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. మూగజీవుల రక్తం మరిగిన ఆ మనిషి పిల్లలను కూడా తీసుకుపోయి చంపేస్తాడేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రాజును మానసిక వైద్యశాలకు పంపించి వైద్యం చేయించేలా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తీర్మానం చేశారు. Also Read:
By October 04, 2019 at 11:36AM
No comments