Breaking News

అత్తింట్లో అల్లుడి హత్య.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య


అత్తకు ఆరోగ్యం బాగోలేదని పరామర్శించేందుకు వెళ్లిన వ్యక్తి దారుణహత్యకు గురైన జిల్లాలో వెలుగుచూసింది. భార్య ప్రియుడితో కలిసి అతడిని చంపేసి పాతి పెట్టినట్లు పోలీసులు విచారణలో తేలడంతో అంతా షాకయ్యారు. Also Read: పానగల్ మండలం కేతేపల్లికి చెందిన ఆంజనేయులు(40)ను చిన్నచింతకుంట మండలం మద్దూరుకు చెందిన రాములమ్మతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదేళ్ల క్రితం రాములమ్మ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. అప్పటినుంచి వారిద్దరు విడిగానే ఉంటున్నారు. సెప్టెంబర్ 23న రాములమ్మ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో ఆంజనేయులు మద్దూరులోని అత్తింటికి వెళ్లి పరామర్శించాడు. ఆరోజు నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. Also Read: ఈ నెల 5న రాములమ్మ తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. భర్తకు దూరంగా ఉంటున్న రాములమ్మ అదే గ్రామానికి చెందిన సలీం అనే వ్యక్తితో పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు వారిద్దరిని ప్రశ్నించగా రాములమ్మ తమ్ముడు రాజుతో కలిసి ఆంజనేయులుని హత్యచేసి పూడ్చివేసినట్లు తెలిపారు. Also Read: నిందితులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు ఆంజనేయులును పూడ్చిపెట్టిన స్థలంలో తవ్వి శవాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సెప్టెంబర్ 23వ తేదీన అత్తింటికి వెళ్లిన ఆంజనేయులు భార్య బాగోతం తెలిసి గొడవ పెట్టుకున్నాడని, తన సుఖానికి ఎక్కడ అడ్డం వస్తాడోనన్న ఆందోళనతో రాములమ్మే భర్తను చంపేందుకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By October 11, 2019 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mahabubnagar-woman-kills-husband-with-lovers-help-to-continue-affair/articleshow/71535508.cms

No comments