Breaking News

నవంబర్‌ 8న `తిప్పరా మీసం`


కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్‌. నవంబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ యాక్షన్ డ్రామాను ఎల్‌ కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు లుక్స్‌, యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు. Also Read: అతి త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఆడియో విడుదల వేడుక కూడా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిప్పరా మీసం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్‌కు సొంత చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. Also Read:


By October 12, 2019 at 01:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sree-vishnus-thipparaa-meesam-release-on-november-8th/articleshow/71552259.cms

No comments