Breaking News

ఆన్‌లైన్‌ గేమ్ ఆడినందుకు రూ.78లక్షలు హష్‌కాకి.. అప్పులు తీర్చలేక ఆత్మహత్య


ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి మరో ప్రాణం బలైపోయింది. ఆన్‌లైన్లో పేకాట ఆడిన ఓ వ్యక్తి ఏకంగా రూ.78లక్షల కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన క్రునాల్ మెహతా (39) బుధవారం రాత్రి మోటా మావా ప్రాంతంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా గదిలో సూసైడ్ నోట్ లభించింది. దానిలో క్రునాల్ పేర్కొన్న కారణం చదివిన పోలీసులకు దిమ్మతిరిగింది. ఆన్‌లైన్లో పేకాటకు బానిసైన తాను రూ.78లక్షలు పోగొట్టుకున్నానని, అప్పులు తీర్చే మార్గం కనబడకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. దీనిపై అతడి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీయగా చాలామంది క్రునాల్ తమవద్ద రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు చెప్పారు. Also Read: ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ విక్రమ్ వంజారా మాట్లాడుతూ.. క్రునాల్ మెహతా ఫోన్లో తరుచూ ఆన్‌లైన్ పేకాట ఆడేవాడు. క్రమంగా దానికి బానిసగా మారిపోయాడు. ఆటలో ఎన్నిసార్లు డబ్బులు కోల్పోయినా మానకుండా ఆడుతూనే ఉండేవాడు. ఇలాగే మొత్తం రూ.78లక్షలు కోల్పోయాడు. దీనికోసం బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల దగ్గర నుంచి లక్షల రూపాయలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక, అప్పు ఇచ్చిన వారికి మొహం చూపించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని తెలిపారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు విక్రమ్ వెల్లడించారు. Also Read:


By October 07, 2019 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gujarat-man-suicide-after-losing-rs-78-lakh-in-online-poker-game/articleshow/71473887.cms

No comments