18ఏళ్లకే ప్రియుడితో పరార్.. ముగ్గురితో ప్రేమాయణం, 5ఏళ్ల తర్వాత హత్య?

కర్ణాటకలోని పట్టణంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. బొమ్మనహళ్లి జిల్లా అరుకలగూడుకు చెందిన భవిత(23) అనే యువతి హాసన్ పట్టణంలోని ఓ హోటల్‌లో ఆదివారం విగతజీవిగా కనిపించింది. ఆమెతో కలిసి హోటల్‌కు వచ్చిన వ్యక్తి పరారు కావడంతో అతడే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read: భవిత 18ఏళ్ల వయస్సులో ఓ యువకుడితో ప్రేమలో పడగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను మేజర్‌నని, ప్రియుడితోనే ఉంటానని యువతి చెప్పడంతో పేరెంట్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఐదేళ్ల తర్వాత ఆదివారం హాసన్ పట్టణంలోని సరయు హోటల్ సమీపంలో భవిత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. Also Read: భవిత 12రోజుల క్రితం సరయు హోటల్‌లో దిగినట్లు తెలుస్తోంది. ఆమె చేతిపై పునీత్ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. శనివారం రాత్రి పునీత్ అనే యువకుడు భవిత గదికి వచ్చినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో అతడే భవితను చంపేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే భవిత ఇప్పటివరకు ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాళ్లలో ఎవరైనా కక్షతో ఆమెను హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By October 21, 2019 at 08:59AM
No comments