Breaking News

Suriya Bandobast: ‘బందోబస్త్’ ట్విట్టర్ రివ్యూ: సూర్య ఈజ్ బ్యాక్.. ఎత్తేస్తున్నారే!


గజిని, సింగం వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించి.. విలక్షణ నటుడిగా పేరొందిన లేటెస్ట్ మూవీ ‘బందోబస్త్’. చాలా రోజులుగా సరైన హిట్‌లేక ఢీలాపడ్డ సూర్య.. ‘బందోబస్త్’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేడు (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. ‘కాప్పన్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘బందోబస్తు’ పేరుతో విడుదల చేశారు. మోహన్ లాల్, ఆర్యలు కీలకపాత్రల్లో నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఉగ్రవారం, సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. Read Also: మోహన్ లాల్ ఈ చిత్రంలో దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటించారు. ఆయనకు సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య కనిపిస్తున్నారు. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్‌గా విభిన్న పాత్రల్లో వైవిధ్యభరిత నటనను ప్రదర్శిస్తున్నారు సూర్య. ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ ఇతర పాత్రల్లో నటించగా.. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలకు రీచ్ అయ్యిందా? సూర్య ‘బందోబస్త్’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యి హిట్ కొట్టారా అంటే.. అవుననే అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమా ప్రీమియర్ షోలు తమిళనాడుతో పాటు యుఎస్‌లోనూ ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదికగా పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారు.


By September 20, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/suriya-and-mohanlal-starrer-bandobast-movie-audience-and-public-response/articleshow/71212902.cms

No comments