Breaking News

Ravi Teja: ‘డిస్కో రాజా’ ఫస్ట్ లుక్: మాస్ డాన్ తేడాగా ఉన్నాడే!


టాలీవుడ్ మాస్ మహారాజా ‘డిస్కో రాజా’ అవతారం బయటకు వచ్చింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మహరాజ్‌కి జై అంటూ మాస్ మహరాజా ‘డిస్కోరాజా’ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘గెట్ రెడీ ఫర్ డిస్కో’ అంటూ డాన్ చైర్‌లో చేతిలో గన్ పట్టుకుని విలన్‌లా నవ్వుతూ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. హీరోనా లేక విలన్‌‌నా తెలియకుండా కాస్త తేడాగానే కనిపిస్తున్నాడు మాస్ రాజా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన దర్శకుడు వీ ఐ ఆనంద్.. మాస్ రాజాతో మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘నేల టిక్కెట్’ఫ్లాప్ తర్వాత ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి మరోసారి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.


By September 02, 2019 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mass-raja-ravi-teja-starrer-disco-raja-movie-first-look-released/articleshow/70943167.cms

No comments