Breaking News

Prabhas: ‘సాహో’కి నెగెటివ్ టాక్ ఎవరివల్ల? సినిమా అమ్మలేదనే ఇలా చేసారా?


సినిమా రిలీజ్ అయ్యింది. దానికి సంబందించిన హడావిడి కూడా కాస్త నెమ్మదించింది. విమర్శకుల రివ్యూలకు,నెగెటివ్ టాక్‌కి వెరవకుండా స్ట్రాంగ్‌గా కలెక్షన్స్ కుమ్ముతున్నాడు యంగ్ రెబెల్ స్టార్. బాక్స్ ఆఫీస్ దగ్గర రారాజుగా తన హవా కొనసాగిస్తున్నాడు. సాహో సినిమా కంటెంట్ విషయంలో తెలుగు తో పాటు సౌత్ విమర్శకులు, చాలామంది ప్రేక్షకులు కూడా సినిమా అనుకున్నంత లేదు అని మాత్రమే అన్నారు. కానీ సాహోపై బాలీవుడ్ మీడియా విరుచుకుపడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. భారత్ లాంటి యావరేజ్ సినిమాకే నాలుగు స్టార్స్ వేసిన సూపర్ క్రిటిక్ సాహోకి మాత్రం ఒకటిన్నర స్టార్స్ వేసి అస్సలు భరించలేం అనేశాడు. ప్లాప్ కి,దారుణమయిన డిజాస్టర్ అనే పదాలకు మధ్య చాలా తేడా ఉంది. కానీ సినిమాలో మరీ డిజాస్టర్ అనేంత కంటెంట్ అయితే లేదు. కనీసం ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు ఫ్లాట్‌గా ఉన్నా కూడా ఈజీగా పాస్ అయిపోయేది. అయితే అదంతా వేరే కోణం. ఇక్కడ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే భారత్, మణికర్ణిక లాంటి యావరేజ్ సినిమాలకు చేతికి వేముక లేనట్టు రేటింగ్స్ వేసి, ఆణిముత్యాలు అన్నట్టుగా బిల్డ్ అప్ ఇచ్చిన పెద్ద మనిషి సాహోని మాత్రం పూర్తిగా తీసి పారేశాడు. అయితే అది కావాలని చేసిందే తప్ప నిజంగా ఫీల్ అయ్యి రాసింది కాదు అనేది బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. దానికి వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే ముందుగా సాహో సినిమాని బాలీవుడ్‌లో టాలీవుడ్ సినిమాలు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న ఒక ప్రొడక్షన్ హౌస్‌కి ఇద్దాం అని అనుకున్నారు. కానీ అక్కడ గీసి గీసి బేరం ఆడుతుండడంతో వెదుక్కుంటూ వచ్చిన T -సిరీస్కి రైట్స్ అమ్మారు. అది మనసులో పెట్టుకున్న సదరు బడా డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ ఫేమస్ టీవీ షో హోస్ట్ సాహోని టార్గెట్ చేసాడని, తనకు సినిమా అమ్మకపోతే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాలని ఫిక్స్ అయ్యాడని, అందుకే తన మాట వినే క్రిటిక్స్కి ఏం రాయాలి? అనే స్క్రిప్ట్ తానే అందించాడని టాక్. కొట్టిపారెయ్యడానికి ఇది గాసిప్ కాదు పెర్ఫెక్ట్ స్కెచ్ అని కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. కానీ అవి బయటపడకుండా జాగ్రత్తగా మ్యానేజ్ చేసేసారు. తెలుగు సినిమా అనే కాదు గతంలో తన సినిమా రిలీజ్ చేస్తున్న టైం కే మరో సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో కమల్. ఆర్. ఖాన్ అనే ఉన్మాది తరహా క్రిటిక్ ని పురమాయించి అపోజిట్ సినిమాని చీల్చిచెండాడానికి బేరం కుదుర్చుకున్నాడు. అందుకు సంబంధించిన ఆడియో టేప్ అప్పట్లో కలకలం రేపింది. ఇప్పుడు మళ్ళీ అతనిపైనే ఈ ఆరోపణ కూడా వచ్చింది. అడిగిన రేట్లకు సినిమా అమ్మకపోతే ఆ సినిమాని కిల్ చెయ్యడం అనేది ఎక్కడి ఆనవాయితీ. కోట్లు పెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమా తీస్తారు అని తెలిసి కూడా దాన్ని కావాలని నాశనం చెయ్యాలని చూడడం అంటే ఎంత దారుణం. ఇప్పుడు సాహో కొల్లగొడుతున్న వసూళ్లు చూసయినా అలాంటి వృధా ప్రయత్నాలు మానుకుంటే మంచిది. త్వరలో సైరా రాబోతుంది. వరుసగా పాన్ ఇండియా మూవీస్ వచ్చి బాలీవుడ్ని తుడిచేస్తాయనే భావనతో దాని మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంచి సినిమాలను ఆదరించాలి అనే స్పృహ ఆడియన్స్కి ఉన్నంతవరకు సినిమా స్థాయిని తగ్గించాలి అని చేసే ప్రయత్నాలు అన్నీ తిరిగి చెడ్డ పేరుని ఆపాదిస్తాయి తప్ప వేరే ఉపయోగం ఉండదు.


By September 04, 2019 at 10:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/reason-behind-bollywood-spreading-too-much-negativity-on-saaho/articleshow/70970936.cms

No comments