Mumbai: హోటల్ కేంద్రంగా వ్యభిచార దందా... రైడింగ్‌లో చిక్కిన ముగ్గురు

ముంబయిలో ఓ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార దందాను పోలీసులు చేధించారు. అంధేరిలోని జేబీ నగర్‌లో గల ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో శనివారం రాత్రి కొందరు పోలీసులు విటుల రూపంలో హోటల్‌కు వెళ్లారు. Also Read: వ్యభిచార ముఠా నిర్వాహకులతో మాట్లాడి అమ్మాయిల వివరాలు తెలుసుకున్నారు. కొద్దిసేపటికే 10 మంది పోలీసులు హోటల్‌లో రైడ్ చేసి నిర్వాహకుడు కరణ్ నమస్ యాదవ్‌తో పాటు హోటల్ యజమానులు అయిన సంతోష్ యాదవ్, అశోక్ యాదవ్‌లను అరెస్ట్ చేశారు. కొందరు యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. Also Read: వీరంతా ఆన్‌లైన్‌లో అమ్మాయిల ఫోటోలు, వివరాలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై మహిళల అక్రమ రవాణాతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు అక్టోబర్ 4వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన సమీర్, అమర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. Also Read: Also Read:
By September 30, 2019 at 11:33AM
No comments