Mulugu Horoscope: సెప్టెంబరు 17 రాశి ఫలాలు- ఓ రాశివారికి ఆర్థికపరిస్థితి అనుకూలం
మేషం : కార్యజయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృషభం : మిత్రులతో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. మిథునం : యత్న కార్యసిద్ధి పొందుతారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటకం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వాహనయోగం. సింహ : ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధనలాభాలు. కన్య : బంధువులతో ఏర్పడిన వివాదాలు, తగాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ధనలాభం. తుల : కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చికం : ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ధనలాభాలు. ధనుస్సు : రుణ బాధలు తప్పవు. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకొని ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మకరం : ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్, షేర్ల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. కుంభం : నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మీనం : కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
By September 17, 2019 at 07:20AM
No comments