Breaking News

ప్రధాని మోదీకి సీఎం జగన్ బర్త్ డే విషెస్..


ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నేడు. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీ 69వ వసంతాలు పూర్తి చేసుకున్నారు. మోదీ జన్మదిన సందర్భంగా దేశ విదేశాలకు చెందిన నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం మోహన్ రెడ్డి ఉదయాన్నే ప్రధానికి బర్త్ డే విషెస్ చెపపారు. చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, దేశానికి మరింత సేవ చేయాలని ఆకాక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతావని అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. మోదీ చిరకాలం ఆరోగ్యంగా, ప్రజాసేవలో ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ, అసమాన్య శక్తిగా మారి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అగ్రపథంలో నిలబెట్టి, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ట్వీట్ చేసింది. నవభారత నిర్మాత.. ప్రజల హృదయాల్లో కొలువైన ప్రియతమ నాయకుడు.. 130 కోట్ల భారతీయుల ప్రధాన సేవకుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ.. తన పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం గాంధీనగర్‌ నుంచి ఆయన నర్మదా జిల్లాలోని కెవదియాలో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తారు. నర్మదా నదీ తీరంలో పూజ నిర్వహించడంతో పాటు సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శిస్తారు. గరుడేశ్వర్‌లో దత్తాత్రేయ మందిరాన్ని సందర్శిస్తారు. అనంతరం కెవదియాలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.


By September 17, 2019 at 08:11AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-cm-ys-jagan-greet-pm-narendra-modi-on-his-birthday/articleshow/71160184.cms

No comments