Hyderabad: 9ఏళ్ల బాలికపై మేనమామ అత్యాచారం

కన్నబిడ్డలా చూడాల్సిన మేనకోడలిపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని 9ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా తన పశువాంఛ తీర్చుకున్నాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ ఘటన జరిగింది. Also Read: మాదాపూర్‌లో నివాసముండే దంపతులకు 9ఏళ్ల బాలిక ఉంది. బాలిక మేనమామ అయిన ఓ యువకుడు తరుచూ వారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వేళ ఆ ఇంటికి వచ్చిన యువకుడు బాలికను మాటల్లోకి దించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని బాలికను గదిలోకి తీసుకెళ్లాడు. ఆటాడుకుందామంటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడి వెళ్లిపోయాడు. Also Read: కాసేపటికి ఇంటికి వచ్చిన దంపతులు బాలిక దుస్తులపై రక్తపు మరకలు ఉండటం చూసి ఏం జరిగిందని ఆరా తీశారు. మామయ్య ఆడుకుందామంటూ గదిలోకి తీసుకెళ్లాడని చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే బాలిక జననాంగాల వద్ద పరిశీలించగా తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 29, 2019 at 11:12AM
No comments