Darbar: తలైవా స్టైల్.. వారెవ్వా..
‘పుట్టుకతో వచ్చింది చచ్చేదాకా పోదు’ అని ‘నరసింహ’ సినిమాలో చెప్పినట్లు.. ఆయన స్టైల్ ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దర్బార్’ సినిమాలోని స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీ.. మురుగదాస్‌తో ఏదో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటో అది. లుక్‌లో తలైవా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దాంతో అభిమానులు ఆయన స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు. దాదాపు పది గంటలుగా ఇండియా ట్విటర్ ట్రెండ్స్‌లో ‘దర్బార్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత తలైవా ఇందులో పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సినిమాకు సంగీతం అందించనున్నారు. నవంబర్‌లో కానీ డిసెంబర్‌లో కానీ ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీ ఎంట్రీ సాంగ్‌ను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.
By September 03, 2019 at 11:14AM
No comments