ప్రియాంకతో అఫైర్ వద్దన్నందుకే సతీశ్‌ను చంపేశా.. పోలీసులతో హేమంత్
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ హత్యకేసు నిందితుడు హేమంత్ పోలీసులకు చిక్కాడు. ప్రియాంకతో అక్రమ సంబంధం వద్దన్నందుకే సతీశ్‌ను గొంతు కోసి చంపేశానని అతడు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. Also Read: తనకు పరిచయస్తురాలైన ప్రియాంక అనే యువతితో హేమంత్ అక్రమ సంబంధం పెట్టుకోవడం సతీశ్‌కు నచ్చలేదని, ఈ విషయంపై ఇద్దరికీ చాలాసార్లు గొడవలు కూడా జరిగాయని పోలీసులు గుర్తించారు. ప్రియాంకను వదిలేయాలని సతీశ్ పదేపదే కోరడంతో తాను ఓర్వలేకే అతడిని హత్య చేసినట్లు హేమంత్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్య తానొక్కడినే చేశానని, ఇందులో ప్రియాంక ప్రమేయం ఏమీ లేదని అతడు చెప్పినట్లు సమాచారం. Also Read:
ఈ నెల 29న తేదీన హేమంత్ ఇంటికి వెళ్లిన సతీశ్.. ప్రియాంక వ్యవహారంపై అతడితో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కాసేపు మద్యం తాగిన తర్వాత గొడవ పడ్డారని, ఆ తర్వాత హేమంత్ తన ఫ్రెండ్ గొంతు కోసి చంపేశాడని అనుమానిస్తున్నారు. శవాన్ని ముక్కముక్కలుగా నరికి సంచిలో వేసేందుకు హేమంత్ ప్రయత్నించాడని తెలుస్తోంది. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పారిపోయి , మియాపూర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి తిరిగి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత సతీశ్‌ను చంపేసినట్లు హేమంత్ చెప్పడంతో ఆ ఫ్రెండ్ భయపడి పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చాడు. అది నచ్చని హేమంత్ అక్కడి నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. మూడు రోజులుగా అక్కడే ఉంటున్న హేమంత్‌ను పోలీసుల సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సతీశ్‌కు తనకు ఆర్థిక వివాదాలేమీ లేవని, కేవలం ప్రియాంక వ్యవహారంలో అడ్డొస్తున్నందుకే చంపేశానని హేమంత్ పోలీసులకు చెప్పాడు. Also Read: నా భర్తకు అతి మంచితనమే శాపమైంది: సతీశ్ భార్య అయితే తన భర్త హత్య కేసులో అనేక అనుమానాలున్నాయని సతీశ్ భార్య ఆరోపిస్తున్నారు. సతీశ్ ప్రవర్తనపై అనుమానాలు వచ్చేలా ప్రియాంక వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని, తన భర్త ఎంత మంచివాడో అతడి పరిచయస్తులను అడిగితే చెబుతారని అంటున్నారు. సతీశ్ హత్యకేసులో మరికొందరు స్నేహితుల ప్రమేయం ఉందని, ఆర్థిక లావాదేవీల కారణంగా ఆయన్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన భర్త ఎవరినైనా వెంటనే నమ్మేస్తారని, అదే ఆయనకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By September 03, 2019 at 11:31AM
No comments