Breaking News

బడుగు జీవుల జీవన చిత్రం ‘బి.జె’


బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కష్టనష్టాలపై రూపొందిన చిత్రం ‘బి.జె’. ‘బడుగు జీవులు’ అన్నది ఉప శీర్షిక. నిర్మాతలు-దర్శకుడు తదితరులంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. ఎస్.బి ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుధాకర్-విభూది బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. రోబోట్ సుధాకర్. ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ బాబు, సేయిన్ కాన్ లోన్, హీనారాయ్, మంజీరా, సునీతామనోహర్, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్ర దారులు. ఆసక్తికరమైన కథ-కథనాలతో బడుగు జీవుల సాధక బాధలు కళ్ళకు కట్టినట్లు రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు తోట సుధాకర్-విభూది బాలరాజు చెబుతున్నారు. బడుగు జీవుల హక్కుల కోసం పోరాడుతూ రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై తెరకెక్కించామని దర్శకుడు రోబోట్ సుధాకర్.ఎన్ అన్నారు. 

ఈ చిత్రానికి కథ-మాటలు: గురుచరణ్, పాటలు: గురుచరణ్-మాధవ్ స్వామి, సంగీతం: సతీష్ సాలూరి, కెమెరా: నాగబాబు కర్రా, నిర్మాతలు: తోట సుధాకర్-విభూది బాలరాజు, దర్సకత్వం: రోబోట్ సుధాకర్.ఎన్.



By September 10, 2019 at 05:28AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47364/bj-movie.html

No comments