సక్సెస్‌ల సమంత రూటులో రకుల్!
పెళ్లి తర్వాత పెద్ద స్టార్స్ సినిమాల్లో నటించకపోయినా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సమంత ప్రస్తుతం వెబ్ సీరీస్ లోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో సక్సెస్ ఉన్నప్పటికీ... పెళ్లి తర్వాత సమంతకి స్టార్ హీరోల సినిమాలు దూరమయ్యాయనే చెప్పాలి. కానీ లేడి ఓరియెంటెడ్ సినిమాల్తో సమంత మాత్రం సత్తా చాటుతుంది. తాజాగా సమంత బాటలోనే మరో హీరోయిన్ వస్తుందట. అది కూడా ప్రస్తుతం ప్లాప్ లో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ భారీ డిజాస్టర్స్ తో ఉన్న రకుల్.. ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కావాలంటుంది.
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పక్కన పెట్టిన రకుల్ కి సీనియర్ హీరోలు అయినా అండగా నిలుస్తారని ఆశపడింది. అయితే నాగ్ ‘మన్మథుడు 2’.. రకుల్ కి టాలీవుడ్‌లో షాకిచ్చింది. ఎన్జీకే తమిళంలో షాకిచ్చింది. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2 లో ఓ రోల్ చేయబోతుంది. ఆ సినిమా ఎప్పుడు విడుదవుతుంది తెలియదు. కానీ తాజాగా వర్కౌట్స్ చేస్తూ బిజీగా వున్న రకుల్ మాత్రం కొత్త తరహా సినిమాలు చెయ్యాలని ఉబలాట పడుతుంది. తన వలన నిర్మాతలకు లాభం రావాలి కానీ... నష్టాలూ రాకూడదని రకుల్ అనుకోవడం నిజంగా సూపర్.
By September 10, 2019 at 05:38AM
No comments