Breaking News

భర్తతో బతకలేక, ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం


యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నెల్లిమర్లలోని డైట్ కాలేజీ సమీపంలో బుధవారం ప్రేమ జంట రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో యువతి పరిస్థితి విషమంగా ఉండగా, యువకుడుకి స్వల్పగాయాలయ్యాయి. బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన నాగరాజు, అరసాడ గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియెట్‌ కలిసి చదువుకున్నారు. కాలేజీలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుచెప్పి తమ కూతురిని వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. అయితే పెళ్లయినా ప్రియుడిని మనసులో నుంచి తీసేయని యువతి అతడితో తరుచూ ఫోన్లో మాట్లాడేది. Also Read: గ్రామంలో ఓ పని నిమిత్తం వారం రోజుల క్రితం ఆమె భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు రైలు టిక్కెట్లు రిజర్వేషన్లు చేయిస్తానంటూ ఆమె మంగళవారం ఒంటరిగా బలిజిపేటకు వచ్చింది. అక్కడ ప్రియుడు నాగరాజును కలిసి అతడితో విజయనగరం చేరుకుంది. ఇద్దరూ సినిమా చూసి రెస్టారెంట్‌లో భోజనం చేసి సంతోషంగా గడిపారు. రాత్రయినా అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు అత్తమామలకు ఫోన్ చేయగా వారు కూడా అక్కడికి రాలేదని చెప్పారు. Also Read: తాను భర్తతో ఉండలేకపోతున్నానని చెప్పిన యువతి చావైనా బతుకైనా నీతోనే అని నాగరాజుతో చెప్పింది. దీంతో అతడు కలిసి బతకలేనప్పుడు చనిపోదామని చెప్పడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విజయనగరంలో ఓ రైలెక్కిన వీరు బుధవారం ఉదయం సమీపంలో అందులో నుంచి దూకేశారు. ఈ జంటను చూసి స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. యువతి ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు నిజంగానే రైలు నుంచి దూకారా? లేక నెల్లిమర్ల డైట్ కాలేజీ దగ్గరకు వచ్చి రైలు కింద పడేందుకు ప్రయత్నించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు తెలిపారు. Also Read:


By September 05, 2019 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lovers-jumped-from-moving-train-for-suicide-attempt-in-vizianagaram-district/articleshow/70987800.cms

No comments