గోదావరి విషాదం: తెలంగాణ వాసుల కోసం భద్రాచలం, ఏపీల్లో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
విహారయాత్ర ఏపీ, తెలంగాణల్లో విషాదం నింపింది. సరదాగా విహార యాత్ర కోసం వెళ్లినవారు.. బోటు బోల్తాపడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 12 మంది మరణించినట్టు తెలుస్తుండగా.. 30 మందికిపైగా ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో హైదరాబాద్ నుంచే 22 మంది ఉండగా.. వరంగల్ నుంచి 14 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారిలో 8 మంది గల్లంతయ్యారని సమాచారం. వరంగల్ నుంచి వెళ్లిన వారిలో ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. తమవారి యోగక్షేమాల కోసం బంధువుల్లో ఆందోళన నెలకొంది. బోటు ప్రమాదం బాధితుల కుటుంబీకుల కోసం తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. బాధితుల సంబంధీకులు సహాయం కోసం తమను సంప్రదించొచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు తెలిపారు. 9490636555 నంబర్ ద్వారా కొత్తగూడెం కలెక్టర్‌ను, 8332861100 కొత్తగూడెం ఎస్పీని, 9440795319 నంబర్‌లో భద్రాచలం ఎఎస్పీని, 9440795320 నంబర్‌లో భద్రాచలం సీఐని సంప్రదించొచ్చని తెలిపింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆ వివరాలు మీకోసం.. * కలెక్టర్ ఆఫీస్, కాకినాడ - 18004253077 * సబ్ కలెక్టర్ ఆఫీస్, రాజమండ్రి - 08832442344 * సబ్ కలెక్టర్ ఆఫీస్, ఏటపాక - 08748 285279 * ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, రంపచోడవరం - 1800 4252123 * ఆర్డీవో ఆఫీస్, అమలాపురం - 08856 233100 * కలెక్టరేట్, పశ్చిమగోదావరి - 1800 233 1077 * మచిలీపట్నం కలెక్టరేట్ - 08672 252847
By September 16, 2019 at 08:20AM
No comments