Breaking News

కోడెల ఆత్మహత్యాయత్నం..? పరిస్థితి అత్యంత విషమం..! వెంటిలేటర్ మీద చికిత్స..


టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నివాసంలో తన నివాసంలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా.. ఆయనకు గుండెపోటు వచ్చిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన్ను హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. రెండు రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల ట్యాక్స్ పేరిట నరసరావు పేట ప్రాంతంలో బలవంతంగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.


By September 16, 2019 at 12:38PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-assembly-former-speaker-kodela-siva-prasada-rao-health-condition-is-critical/articleshow/71146602.cms

No comments