Breaking News

హనుమాన్ జంక్షన్ ‌వద్ద రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి


కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు.


By September 16, 2019 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-hanuman-junction-5-died/articleshow/71146745.cms

No comments