చంద్రబాబు దంపతుల పెళ్లి రోజు.. సహధర్మచారిణి అనే మాటను నిజం చేస్తూ.. లోకేశ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పెళ్లి రోజు నేడు (సెప్టెంబర్ 10). 1980లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు శుభాకాంక్షలు చంద్రబాబు దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. చంద్రబాబు దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా.. అద్భుతమైన ట్వీట్ చేశారు. సహధర్మచారిణి అనే పదానికి అమ్మ నిలువెత్తు నిదర్శనం అన్నారు. అమ్మానాన్నలు ఆదర్శ దంపతులంటూ కొనియాడారు. ‘‘ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విదేశాలకు వెళ్లిన సందర్భంలో.. సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దిగిన ఫొటోను లోకేశ్ షేర్ చేశారు.
By September 10, 2019 at 10:09AM
No comments