‘నీ భర్త వచ్చేవరకు నాతో గడుపు’.. ఒప్పుకోలేదని వివాహితపై అఘాయిత్యం
తనకంటే వయస్సులో పెద్దదైన మహిళను లైంగిక వాంఛ తీర్చమని వేధించాడా యువకుడు. ఆమె కాదనేసరికి కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. బాధితురాలి కేకలతో చుట్టుపక్కల సకాలంలో స్పందించి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: తమిళనాడులోని జిల్లా బాక్కంపాడి కాట్టుకొటై ప్రాంతానికి చెందిన చిన్నదురైకి కడలూరు జిల్లా వేప్పూర్ ప్రాంతానికి చెందిన అరుణాదేవి(28)తో 8ఏళ్ల క్రితం వివాహమైంది. చిన్నదురై ఉపాధి నిమిత్తం సింగపూర్‌లో ఉండగా.. అరుణాదేవి ఇద్దరు కుమారులు, అత్తతో కలిసి ఉంటోంది. ఏడాది క్రితం అరుణాదేవి పెద్దమ్మ కొడుకు ప్రశాంత్ ఈ ఏడాది జనవరిలో పొంగల్ సారె తీసుకొచ్చాడు. అతడితో వారింటికి వచ్చిన స్నేహితుడు ఏలుమలై అరుణాదేవిపై కన్నేశాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటున్న సంగతి తెలుసుకుని అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. Also Read: ప్రశాంత్‌కు తెలియకుండా అతడి ఫోన్లో నుంచి అరుణాదేవి నంబర్ దొంగిలించి తరుచూ ఫోన్ చేసేవాడు. అన్న ఫ్రెండే కదా అని ఆమె కూడా అతడితో మాట్లాడేది. ఓసారి మాటల క్రమంలో తన కోరికను ఏలుమలై బయటపెట్టాడు. ‘నువ్వు భర్తకు దూరంగా ఉంటున్నావు కదా.. శారీరకం సుఖం కావాలంటే నేనిస్తా.. నాతో గడుపు’ అంటూ తరుచూ వేధిస్తున్నాడు. దీంతో అరుణాదేవి అతడితో మాట్లాడటం మానేసింది. శనివారం ఓ పని నిమిత్తం ఏలుమలై బాక్కంపాడి కాట్టకొటై వచ్చాడు. అరుణాదేవి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని లోనికి దూరాడు. Also Read: తన కోరిక తీర్చాలని అరుణాదేవిని ఒత్తిడి చేశాడు. తాను అలాంటి దానిని కాదని, వదిలేయాలని ఆమె వేడుకున్నా కనికరించకుండా బలవంతం చేయబోయాడు. ఎంత ప్రయత్నించినా ఆమె లొంగకపోవడంతో ఆగ్రహంతో వంటింట్లో ఉన్న కిరోసిన్ తెచ్చి ఆమెపై పోసి నిప్పటించాడు. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి సేలం జిల్లా ఆత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడు ఏలుమలైపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By September 03, 2019 at 09:23AM
No comments