ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబయి మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. నవీ ముంబయిలోని ఉరాన్ ప్రాంతలో గల ప్లాంట్ కోల్ట్ స్టోరేజీలో భారీ పేలుడు సంభవించడంతో అగ్నికీలకు ఎగసిపడ్డాయి. Also Read: ప్రమాదం జరిగిన వెంటనే సైరన్ మోగడంతో అన్ని విభాగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిబ్బంది ప్లాంట్‌లో ఉన్న అందరినీ వెంటనే బయటకు పంపేశారు. హుటాహుటిన 50 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఓఎన్‌జీసీ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. Also Read:
By September 03, 2019 at 09:53AM
No comments