Breaking News

కనీసం మ్యాటర్‌కు కూడా నోచుకోని ‘సైరా’!


అసలే ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్స్‌లో చాలా వీక్‌గా కనబడుతుంది. విడుదలకు ఒక వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది.. కానీ సైరా ప్రమోషన్స్ మోత ఎక్కడా మోగడం లేదు. ఐదు భాషలలో సినిమా మీద బజ్ తీసుకురావడానికి మూవీ యూనిట్ మొత్తం ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ హంగామా మొదలెట్టకపోతే కష్టం. ఇక హైదరాబాద్‌లో చేసిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షార్పణం కావడంతో అభిమానులు కూడా ఎంతో నిరాశలో ఉన్నారు. కొందరి దగ్గర పాస్‌లు ఉన్నా కూడా లోపలికి పంపించని వైనంతో ఫ్యాన్స్ కూడా హర్టయ్యారు. ఇలాంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు చిత్రయూనిట్‌కి చేరవేయాల్సిన టీమ్ మాత్రం ఏమీ పట్టనట్లు చూస్తుండిపోతుంది. ఇక సినిమాకు సంబంధించి 25, 26, 27లలో హైదరాబాద్‌లో ఇంటర్వూస్ ఉంటాయనే న్యూస్ వినబడుతుంది కానీ సరైన క్లారిటీ అయితే లేదు.

అసలే ‘సైరా’ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్‌లో ఉంటే... చిత్రాన్ని ప్రేక్షకుల చెంతకు తీసుకువెళ్లాల్సిన ‘సైరా’ పిఆర్ టీం కూడా చాలా పూర్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కనీసం ఆ ఈవెంట్‌కి సంబంధించి పేపర్స్‌కి, వెబ్ సైట్స్‌కి మ్యాటర్ పంపే నాథుడే లేడంటే సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేనా సైరా సెన్సార్ పూర్తయింది. దానికి సంబందించిన న్యూస్ కానీ ఓ పోస్టర్ కానీ ఇంతవరకు పీఆర్ టీం అఫీషియల్‌గా పంపలేదు అంటే.. సైరా ప్రమోషన్స్ విషయంలో పీఆర్ టీం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతుంది. 

ప్రస్తుత టాలీవుడ్‌లో చిన్న ప్రెస్‌మీట్ జరిగితే చాలు.. దానికి సంబంధించిన మ్యాటర్‌ని తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆయా సినిమాల పిఆర్వోస్ మీడియాకు పంపుతున్నారు. అలాంటిది ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోకి పీఆర్ చేస్తూ కూడా సినిమా విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై మెగాభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు. అదేమంటే సోషల్ మీడియాలో వచ్చేస్తుందిగా.. మళ్ళీ మనం ప్రత్యేకంగా పంపడం ఎందుకులే అనుకున్నట్టుగా ఉంది... సైరా పీఆర్ టీమ్ వ్యవహారం. ఇలా సోషల్ మీడియాని నమ్ముకునే గత ఎన్నికల్లో ఓ పార్టీ ఎలాంటి రిజల్ట్‌ని అందుకుందో తెలిసిందే. ఇకనైనా సైరా పీఆర్ టీమ్ సినిమాపై శ్రద్ద పెడతారేమో చూద్దాం.



By September 25, 2019 at 02:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47587/sye-raa.html

No comments