భర్తను చంపి నోట్లో యాసిడ్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరణ
నిత్యం తాగొచ్చి కొడుతున్న భర్తను తమ్ముడి సాయంతో చంపేసిందో ఇల్లాలు. అంతటితో ఆగకుండా శవం నోట్లో యాసిడ్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం మధురానగర్‌లో జరిగింది. Also Read: జీడిమెట్ల గాజుల రామారం, నెహ్రూనగర్‌కు చెందిన నూనె నర్సింహులు (43) తన భార్య సునీత(40)తో కలిసి కొంతకాలం క్రితం రాయదుర్గంలోని మధురానగర్‌కు వచ్చి నివసిస్తున్నారు. నర్సింహులు ఇటీవల మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడుతున్నాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన సునీత అతడిని ఎలాగైనా అంతమొందించాలనుకుంది. ఇదే విషయాన్ని తన తమ్ముడు శ్రీనివాస్(34)కి చెప్పి ప్లాన్ వేసింది. గురువారం(సెప్టెంబర్ 19) ఇంటికి తాగొచ్చిన భర్త తలపై కర్రతో కొట్టింది. ఆ తర్వాత శ్రీనివాస్ నైలాన్ తాడుతో అతడి గొంతు బిగించి చంపేసి నోట్లో యాసిడ్ పోశారు. Also Read: మరుసటి రోజు సునీత రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే నర్సింహులు శరీరంపై బలమైన గాయాలు గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సింహులు ప్రాణం పోయిన తర్వాత యాసిడ్ తాగించినట్లు రిపోర్టులో ఉండటంతో పోలీసులు సునీతను ప్రశ్నించారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో సునీత, ఆమె తమ్ముడు శ్రీనివాస్‌ను రాయదుర్గం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By September 24, 2019 at 12:03PM
No comments