మేకప్ లేకుండా సమంతని చూశారా..!
హీరోయిన్స్‌ను మేకప్ లేకుండా చూడలేం అనేది పాత మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. మేకప్ లేకుండా ఉంటేనే వారు చాలా అందంగా ఉంటారు. ఈ మాటకు టాలీవుడ్ అగ్ర కథానాయికలు కాజల్ అగర్వాల్, సమంతే నిదర్శనం. తాజాగా సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఉన్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘అన్ ఫిల్టర్డ్. నా చేత్తో ఏం చేస్తు్న్నాను అని మాత్రం అడగకండి’ అని పేర్కొన్నారు. మేకప్ లేకుండా కూడా సామ్ ఫేస్ ఎంతో మెరిసిపోతోంది. ఇందుకు కారణం ఆమె స్ట్రిక్ట్ డైట్, జిమ్ చేయడమే. సమంత నో మేకప్ ఫొటోకు ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ‘మీలా కనిపించడానికి మాకు టిప్స్ చెప్పరూ..’ అంటూ కొంత మంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు. తప్పకుండా చెప్తానని సమంత తెలిపారు. సాధారణంగా సమంత పోస్ట్ చేసే ఫొటోల కంటే ఈ ఫొటోకు వచ్చిన లైక్సే ఎక్కువ. సమంత పెట్టే ఫొటో షూట్స్ ఫొటోలకు మ్యాగ్జిమం మూడు లక్షలకు పైగా లైక్స్ వస్తుంటాయి. దీనిని బట్టే అర్థమవుతోంది మేకప్ లేకుండా పోస్ట్ చేసే ఫొటోలకే క్రేజ్ ఎక్కువగా ఉందని. మేకప్ లేకుండా ఫొటోలు పోస్ట్ చేయడమనే ప్రక్రియను స్టార్ట్ చేసింది నటి కాజల్ అగర్వాల్. తొలిసారి తాను మేకప్ లేకుండా ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొ్న్నారు. ఈ ఫొటోకు చాలా మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నటీమణులు ఎక్కడున్నా అందంగా కనిపించాలనుకుంటారు. అలాంటిది మేకప్ లేకుండా ఫొటో పోస్ట్ చేయడమనేది సాహసంతో కూడుకున్న పనే అని చెప్పాలి. సినిమాల్లో మేకప్ లేకుండా నటించాలని ఉందని చెప్పిన నటీమణలు ఎందరో. ఇప్పటికీ బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీమణులు మేకప్ లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా ఫొటోలు తీస్తే ఊరుకోరు. ఏదేమైనా కాజల్, సమంత కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. వీరిని చూసి ఇంకెంత మంది మేకప్ లేకుండా సెల్ఫీలు పోస్ట్ చేస్తారో చూడాలి. ‘ఓ బేబీ’ సినిమాతో మంచి విజయం అందుకున్న సమంత ఇటీవల తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. ఇక నుంచి ఆమె ‘96’ సినిమా రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. సమంత చేతిలో ‘96’ రీమేక్ తప్ప మరో సినిమా లేదు. అయితే ఇప్పుడు సమంత గురించి టాలీవుడ్‌లో వినిపిస్తున్న చర్చ ఏంటంటే.. దర్శకుడు కథ చెప్పడానికి సమంత వద్దకు వెళితే తనకు అంతగా నచ్చలేదని చెబుతున్నారట. ఇందుకు కారణం కథానాయిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే. స్క్రిప్ట్స్‌లో తన పాత్రకు సంబంధించి మార్పులు చేయాలని సమంత డిమాండ్ చేస్తున్నారట. ఇది విని దర్శకులు షాక్ అవుతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. దాంతో సమంతకు కథ చెప్పే సమయంలో నాలుగైదు సినిమాలు చేసేయొచ్చని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారట.
By September 14, 2019 at 02:29PM
No comments