వైసీపీ ఎమ్మెల్యేపై కులధూషణ.. మరో ముగ్గురి అరెస్ట్
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(వైసీపీ)ని కులం పేరుతో దూషించిన కేసులో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జి అనే వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరిలో కొమ్మినేని శివయ్యను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే మిగిలిన ముగ్గురు నిందితులు గ్రామం నుంచి పరారయ్యారు. అయితే వీరిపై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లిన ఎమ్మెల్యే శ్రీదేవిని నలుగురు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. దళితురాలైన తాను ముట్టుకుంటే వినాయకుడు మైలపడతాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల గతేంటని ఆమె ఆవేదన చెందారు. తాడికొండ సీటును వైసీపీకి దక్కడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనపై కక్షగట్టారని ఆమె ఆరోపించారు. Also Read:
By September 04, 2019 at 09:35AM
No comments