కొత్త కోడలిపై కన్నేసిన మామ, మరుదులు.. మసాజ్ చేయాలంటూ వేధింపులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై లైంగిక దాడులకు అంతే లేకుండా పోతోంది. బయటే కాదు.. ఇంట్లోనూ వారికి వేధింపులు తప్పడం లేదు. ఇటీవల కొత్తగా పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కొత్తకోడలిపై కన్నేసిన మామ, మరుదులు తమకు మసాజ్ చేయాలని, కోరిక తీర్చాలని వేధించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Also Read: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమె భయానక అనుభవం ఎదురైంది. కోడలిపై కన్నేసిన మామగారు ఆమెకు గదిలోకి తీసుకుని వెళ్లి బాడీ మసాజ్ చేయాలని ఆమెను ఆదేశించారు. తనకు మసాజ్ చేయడం రాదని, తాను అలాంటిది దానిని కాదని చెప్పి సున్నితంగా తిరస్కరించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతడు తన తండ్రికే వంతపాడి మసాజ్ చేయాల్సిందేనని ఆదేశించాడు. Also Read: దీంతో బాధితురాలు చేసేదేమీ లేక మామగారి గదికి ఒంటరిగా వెళ్లి మసాజ్ చేసింది. ఆ సమయంలో అతడు అసభ్యంగా ప్రవర్తించినా సహనంగా భరించి పని పూర్తిచేసింది. ఆ మరుసటి రోజు తన ఇద్దరు చిన్న కుమారులిద్దరికీ మసాజ్ చేయాలని మామ ఆదేశించగా ఆ మహిళ షాకైంది. దీంతో పాటు మరుదులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని దాచిపెడితే తాను వారి చేతిలో నలిగిపోవాల్సిందేనని భావించిన బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. Also Read:
By September 15, 2019 at 09:15AM
No comments