Breaking News

జగన్‌ సర్కారుకు షాక్.. అధికార లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబం


ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదు. కోడెలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంగళవారం జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈరోజు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపు వైఖరి వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కోడెలను చంపించిన ప్రభుత్వమే ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటే ఎలా అంగీకరిస్తామని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి బలవన్మరణానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని కోడెల కుమార్తె ఇప్పటికే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. Read Also: ప్రభుత్వమే హత్య చేయించి.. అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహిస్తామంటే కుటుంబ సభ్యులు ఎలా అంగీకరిస్తారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కోడెల అంత్యక్రియలను నిర్వహించడానికి టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో నరసరాపుపేట పట్టణంలో ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.


By September 18, 2019 at 09:53AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/kodela-siva-prasada-rao-family-rejects-state-honour/articleshow/71178491.cms

No comments