Breaking News

రాజమహేంద్రవరంలో కమల్ హాసన్.. భారతీయుడు 2 కీలక సన్నివేశాలు అక్కడే


విలక్షణ నటుడు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. పాతికేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. కాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను రాజమహేంద్రవరంలో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కమల్ రాజమహేంద్రవరంకు చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరో 20 రోజుల పాటు కమల్ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. గతంలో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమ షూటింగ్ సమయంలో రాజమహేంద్రవరంలో ఎక్కువ కాలం బస చేశారట. చెన్నైలో భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన తొలి భాగం చిత్రీకరణ పూర్తైంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధా్ర్థ్, కమల్ హాసన్‌కు సంబంధించిన సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించేశారు. రెండో షెడ్యూల్‌లో భారీ పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయట. వీటిని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హీన్స్ కంపోజ్ చేయబోతున్నారు. సీజీఐ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. సినిమాను 2020లో విడుదల చేయాలని మొదట నిర్ణయించుకున్నారు. కానీ సినిమా మొత్తం అవినీతి నేపథ్యంలో తెరకెక్కబోతోంది కాబట్టి 2021లో తమిళనాడులో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటోంది. ఇప్పుడు ఎటూ కమల్ హాసన్ మక్కన్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించేశారు. ఒకవేళ భారతీయుడు 2 ఈయన కెరీర్‌లో చివరి సినిమా అయితే 2021లో జరగబోయే ఎన్నికలకు ఈ సినిమా బాగా కలిసొస్తుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను భారీ బడ్జెట్‌పై నిర్మిస్తోంది. గతంలో లైకా సంస్థకు శంకర్‌కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని దాంతో కొంతకాలం పాటు సినిమా షూటింగ్‌ను ఆపేశారని వార్తలు వచ్చాయి. ఎటూ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో నటి కాజల్ అగర్వాల్ కూడా సినిమా నుంచి తప్పుకొన్నారని అన్నారు. ఆ తర్వాత దీనిపై కాజల్ క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగినా కూడా తాను సినిమా నుంచి తప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్.. సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3తో బిజీగా ఉన్నారు. గత రెండు సీజన్లకు కూడా కమల్ హాసనే హోస్ట్‌గా వ్యవహరించారు. మూడు సీజన్లకూ మంచి స్పందన లభించింది.


By September 18, 2019 at 09:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-kamal-hassan-reaches-rajamahendravaram-for-bharateeyudu-2-shooting/articleshow/71178497.cms

No comments